ఈగ, బాహుబలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శాండిల్‌వుడ్ నటుడు సుదీప్. ఈ సూపర్‌స్టార్, ఆకాంక్ష సింగ్ జంటగా 'పహిల్వాన్' చిత్రంలో నటించారు. ఎస్.కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఐదు భాషల్లో ఆగస్ట్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశవ్యాప్తంగా 2 వేల 500 థియేటర్లలో బ్రహ్మాండంగా విడుదల చేయనుంది చిత్రబృందం.
ఐదు భాషల్లో కిచ్చా 'పహిల్వాన్' రెడీ - 2వేల 500 థియేటర్లలో pahilwan
కన్నడ నటుడు సుదీప్, దర్శకుడు ఎస్.కృష్ణ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం 'పహిల్వాన్'. ఆకాంక్ష సింగ్ కథనాయిక. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్ట్ 29న ఐదు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.
కన్నడ చిత్రం 'హెబ్బులి' తర్వాత రెండోసారి కృష్ణతో కలిసి పనిచేస్తున్నాడు కిచ్చా. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కుస్తీ వీరుడిగా అలరించనున్నాడు సుదీప్. దేశంపై గౌరవం, ఆటపై మమకారం కలిపిన ఆటగాడిగా అలరించనున్నాడు.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలుగులో ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. అర్జున్ జన్యా సంగీతం దర్శకుడు. కబీర్ దుహాన్ సింగ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండగా... బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కీలక పాత్రల్లో నటించారు. నేపాల్, భూటాన్‌లోనూ పహిల్వాన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.