తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ హీరోకు చిక్కులు- కేక్​ కట్ చేసినందుకు కేసు! - కన్నడ​ నటుడు దునియా విజయ్​ తల్వార్(ఖడ్గం)తో కేక్ కట్​ చేయడంపై కేసు

పుట్టినరోజు వేడుకల్లో ఆ హీరో కేక్ కట్​ చేసి చిక్కుల్లో పడ్డాడు. అవును... కేవలం కేక్ కట్​ చేసినందుకే నెటిజన్లు ఆ సినీ నటుడిపై విరుచుకుపడ్డారు. పోలీసులు ఆ నటుడిపై కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇంతకీ.. కేక్ కటింగ్​లో జరిగిన తప్పేంటి?

kannada hero duniya vijay cake cutting with talwar(sword) controversy, police filling case on him
సినీ హీరోకు చిక్కులు- కేక్​ కట్ చేసినందుకు కేసు!

By

Published : Jan 20, 2020, 2:11 PM IST

కర్ణాటక హోస్కెరికిహళ్లిలో కన్నడ​ నటుడు దునియా విజయ్​ తల్వార్(ఖడ్గం)తో కేక్ కట్​ చేయడం వివాదాస్పదమైంది.

నిన్న రాత్రి 47వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు దునియా విజయ్. ఈ సందర్భంగా అభిమానుల కోసం తన కొత్తచిత్రం 'సలగ' టీజర్​ విడుదల చేశాడు. అనంతరం భారీ కేక్ కట్​ చేశాడు. అంతా బాగానే ఉంది కానీ, కేక్​ను సాధారణ కత్తితో కాక పెద్ద తల్వారు ఉపయోగించి కోయడం వల్ల చిక్కుల్లో పడ్డాడు ఈ శాండిల్​వుడ్ హీరో.

సినీ హీరోకు చిక్కులు- కేక్​ కట్ చేసినందుకు కేసు!

అదీ నేరం...

ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడం నేరం. అందుకే సామాజిక మాధ్యమాల్లో విజయ్​ కేక్ కటింగ్ వీడియో వైరల్​గా మారింది. పైగా నడిరోడ్డుపై పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడంపై తెగ ట్రోలింగ్​ మొదలైంది. ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు విజయ్​పై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కామెంట్ల రూపంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

భారత శిక్షా స్మృతి 283 కింద కేసు నమోదు చేసేందుకు గిరినగర్​ పోలీసులు ఈ వేడుకల వీడియోను పరిశీలిస్తున్నారు. ఐదు అంగుళాల కంటే పెద్ద కత్తి అయితే.. ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు దక్షిణ డివిజన్​ డీసీపీ రోహినీ సాఫెట్​.

వివాదస్పదంగా మారిన ఈ అంశంపై దునియా విజయ్​ క్షమాపణ కోరాడు. తాను చేసింది పొరపాటే అని ఒప్పుకున్నాడు. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నాడు.

ఇదీ చదవండి:యాచించే రోజులు పోయాయ్​.. ఇంటికి చేరిన ఇంజినీర్​

ABOUT THE AUTHOR

...view details