నటుడు ధ్రువ సర్జా (ప్రముఖ నటుడు అర్జున్ సర్జా మేనల్లుడు), ఆయన సతీమణి ప్రేరణ కరోనాను జయించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొవిడ్ పరీక్షల్లో ఇద్దరికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపాడు ధ్రువ. కష్టసమయంలో మద్దతుగా నిలిచిన కుటుంబం సహా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు. అంతేకాదు వారిద్దరికీ వైద్యం చేసిన డాక్టర్. సుర్జిత్ పాల్ సింగ్, అతడి వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపాడు.
కరోనాను జయించిన హీరో ధ్రువ సర్జా, ప్రేరణ జోడి
కన్నడ నటుడు ధ్రువ సర్జా, ఆయన సతీమణి ప్రేరణ కరోనా నుంచి కోలుకున్నారు. గతవారం కరోనా లక్షణాలతో బాధపడిన వాళ్లు.. తాజా కొవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు స్పష్టం చేశారు.
కరోనాను జయించిన హీరో ధ్రువ సర్జా, ప్రేరణ జోడి
వీరితో పాటు నటి ఐశ్వర్య అర్జున్ కూడా కరోనా బారిన పడింది. ఈమె వీరి కుటుంబానికి దగ్గరి బంధువు. ఐశ్వర్య ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతోంది.
కన్నడ చిత్రం 'పొగరు'లో హీరోగా నటించాడు ధ్రువ. ఇందులో రష్మిక మందణ్న హీరోయిన్గా సందడి చేసింది.