KV Raju Passed away: కన్నడ ప్రముఖ దర్శకుడు కేవీ రాజు(67) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో గత కొన్నినెలల నుంచి బాధపడుతున్న ఆయనకు గుండెపోటు కూడా రావడం వల్ల మరణించారని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామనర్స్ అధ్యక్షుడు డీఆర్ జైరాజ్ వెల్లడించారు. ఈయన మృతిపట్ల పలువురు నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.
KV Raju: గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ కన్నుమూత
Director died: అనారోగ్య సమస్యలతో పాటు గుండెపోటు రావడం వల్ల కన్నడ డైరెక్టర్ కేవీరాజు కన్నుమూశారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
డైరెక్టర్ కేవీ రాజు
1982లో 'బదద హూవు' సినిమాతో సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన కేవీ రాజు.. 1984లో వచ్చిన 'ఒలవే బడుకు' చిత్రంతో డైరెక్టర్గా మారారు. ఆ తర్వాత కాలంలో 'సంగ్రామ', 'బంధ ముక్త', 'యుద్ధకాండ' లాంటి అద్భుతమైన సినిమాలు తీశారు. 1991లో అమితాబ్ బచ్చన్, జయప్రద కాంబినేషన్లో 'ఇంద్రజిత్' చిత్రంతో బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
ఇవీ చదవండి: