తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాగిణి, సంజనల చుట్టూ బిగుస్తున్న ఈడీ ఉచ్చు! - రాగిణి ద్వివేది న్యూస్​

కన్నడ పరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసును మరో కోణంలో విచారించేందుకు రంగంలోకి దిగింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ). ఇప్పటికే రాగిణి, సంజనా గల్రానీలపై ప్రత్యేకంగా కేసు దాఖలు చేసి వివరాల సేకరణ ప్రారంభించింది. వీరిద్దరూ బినామీల పేర్లతో ఆదాయార్జనకు దిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

Kannada Drug Case: ED joins Bengaluru police in investigation
రాగిణి, సంజనల చుట్టూ బిగిస్తున్న ఈడీ ఉచ్చు!

By

Published : Sep 13, 2020, 10:01 AM IST

మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసును మరో కోణంలో విచారించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సిద్ధమైంది. ఇప్పటికే కథానాయికలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలపై ప్రత్యేకంగా కేసు దాఖలు చేశారు. ఆ ఇద్దరూ బినామీ పేర్లతో అడ్డగోలు ఆదాయార్జనకు దిగినట్లు అనుమానించి.. ఆ కోణంలో విచారణ మొదలుపెట్టారు. దాఖలాల సేకరణ అనంతరం ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించే అవకాశాలున్నాయి.

కోట్లాది రూపాయల వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతుండటం వల్ల... స్వయం ప్రేరితంగా కేసు దాఖలు చేసినట్లు కర్ణాటక- గోవా విభాగ ఈడీ అధికారులు తెలిపారు. కేసులో కీలకంగా ఉన్న వీరేశ్‌ఖన్నా, రాహుల్‌, ప్రశాంత్‌ రంకా, ప్రతీక్‌ శెట్టి.. సీసీబీ కస్టడీలో ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు అధికారులు.

రాగిణి రగడ..

మడివాళ మహిళ సంరక్షణ పునర్వసతి కేంద్రంలో ఉన్న సినీ తారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ పరస్పరం గొడవపడుతున్నట్లు సమాచారం. 'నీవల్లంటే.. నీవల్లే అంతా జరిగింది' అంటూ పోట్లాడుతున్నారని తెలిసింది. మరోవైపు రాగిణి ఆరోగ్య వివరాల గుర్తింపు కోసం శనివారం ఆమెకు మూత్ర నమూనాలు తీసుకొని పరీక్షించారు. అయితే నమూనాల సేకరణకు రాగిణి ఒప్పుకోకుండా.. బాగా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.

  • మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన నిందితులు రవిశంకర్‌, రాహుల్‌, వైభవ్‌జైన్‌, ప్రశాంత్‌ రంకా, నియాజ్‌, ప్రతీక్‌ శెట్టిలకూ కేసీ జనరల్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తం, మూత్రం, తల వెంట్రుకల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు.
  • మాదక ద్రవ్యాల కేసులో నగరానికి చెందిన వైభవ్‌ జైన్‌ అనే బంగారు వ్యాపారిని సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. సినీ నటి రాగిణి ద్వివేదికి అప్తుడిగా ఈ నిందితుడు గుర్తింపు పొందాడు.

ABOUT THE AUTHOR

...view details