తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డ్రగ్స్​ కేసులో స్టార్​ హీరోయిన్​కు నోటీసులు - కన్నడ నటి రాగిణి

డగ్స్ కేసు విచారణలో భాగంగా నటి రాగిణికి నోటీసులు జారీ చేసింది. తమ ప్రధాన కార్యాలయం ఎదుట గురువారం ఆమె హాజరు కావాలని చెప్పింది.

Kannada Actress Ragini gets CCB notice in drug case
హీరోయిన్​ రాగిణి

By

Published : Sep 3, 2020, 12:25 PM IST

కన్నడ సినీ పరిశ్రమలోని కొందరితో డ్రగ్స్ ముఠాకు ఉన్న సంబంధంపై ఆరా తీసేందుకు సెంట్రల్ క్రైమ్​ బ్రాంచ్(సీసీబీ) రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా నటి రాగిణికి నోటీసులు జారీ చేసింది. బెంగళూరులోని సీసీబీ​ ప్రధాన కార్యాలయం ఎదుట గురువారం హాజరవ్వాలని తెలిపారు. అడిషనల్​ కమీషనర్​ సందీప్​ పాటిల్​ బృందం ఆమెను ప్రశ్నించనుంది.

కన్నడ పరిశ్రమలో డ్రగ్స్​ మాఫియా రాజ్యమేలుతుందని, ఎంతోమంది మాదకద్రవ్యాల బారిన పడ్డారని డైరెక్టర్ ఇంద్రజిత్​ లంకేశ్​ ఇటీవలే ఆరోపణలు చేశారు. దీంతో పాటు బీజేపీ నాయకురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న సీసీబీ బృందం, ఇంద్రజిత్​ను బుధవారం ఐదుగంటల పాటు ప్రశ్నించింది. శాండల్​వుడ్​కు చెందిన 15 మంది ప్రముఖులకు ఈ డ్రగ్ రాకెట్​తో లింక్ ఉన్నట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. గురువారం మరోసారి హాజరు కావాలని చెప్పగా, బెంగళూరులోని సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్​కు దర్శకుడు ఇంద్రజిత్ వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details