కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఈ విషయంలో ఇటీవలే అరెస్టయిన నటి సంజన, రాగిణి ద్వివేదిలు శక్రవారం డ్రగ్ టెస్టుకు నిరాకరించారు. పరీక్ష కోసం ఇద్దరినీ కేసీ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. సీసీబీ అధికారులతో వాగ్వాదానికి దిగి.. 'మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు. ఎందుకు హింసిస్తున్నారు' అంటూ గట్టిగా అరిచారు.
డ్రగ్ కేసు: డోపింగ్ టెస్టుకు సంజన, రాగిణి నిరాకరణ! - Central Forensic Science Laboratory, Hyderabad
కర్ణాటక డ్రగ్ రాకెట్ కోణంలో అరెస్టయిన నటి సంజన, రాగిణిలు శుక్రవారం డోపింగ్ టెస్టు చేసుకునేందుకు నిరాకరించారు. తమ పేరు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుందని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
డ్రగ్ కేసు
టెస్టులో భాగంగా రక్తం, జుట్టు నమూనాలను ఇవ్వడం వల్ల తమ పేరు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. సుమారు రెండు గంటల వాదనల అనంతరం.. అధికారులు వారికి నచ్చజెప్పి ఎట్టకేలకు నమూనాలు తీసుకున్నారు. వీటిని మాడివాలా, హైదరాబాద్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలకు పంపనున్నారు.