'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రం తర్వాత అఖిల్ అక్కినేని నటించనున్న కొత్త చిత్రం 'ఏజెంట్'(Akhil Agent). సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వం వహిస్తున్నారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య(Sakshi Vaidya) కథానాయిక. ఇందులో ఓ కీలకపాత్ర కోసం మరో ప్రముఖ నటుడ్ని రంగంలోకి దించాల్సి ఉంది. ఇప్పుడా పాత్ర కోసం చిత్రబృందం వేట ముమ్మరం చేసింది.
నిజానికి ఈ పాత్ర కోసం తొలుత మలయాళ స్టార్ మోహన్‌లాల్(Mohan Lal)ను సంప్రదించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడా పాత్ర కోసం కన్నడ నటుడు ఉపేంద్ర(Upendra) వద్దకు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం ఆయనతో కథ విషయమై చర్చ జరిగినట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది.