తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కిచ్చా సుదీప్‌కు కీలకపాత్ర..? - sudeep as police

దర్శకధీరుడు రాజమౌళి, స్టార్​ హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. టాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీంగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా గురించి మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. కన్నడ నటుడు కిచ్చా సుదీప్​ ఓ కీలకపాత్రలో నటించనున్నాడట.

Kannada Actor Kichcha Sudeep starring in Rajamouli's RRR movie?
'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కిచ్చా సుదీప్‌కు కీలకపాత్ర..?

By

Published : Jan 18, 2020, 10:57 AM IST

Updated : Jan 18, 2020, 11:05 AM IST

కన్నడ నటుడు కిచ్చా సుదీప్​ శాండిల్​వుడ్​లోనే కాకుండా పలు చిత్రసీమల్లో రాణిస్తున్నాడు. ఇటీవలే తెలుగులో మెగాస్టార్​ చిరంజీవితో సైరాలో నటించిన ఇతడు... ఆ తర్వాత బాలీవుడ్​లో సల్మాన్​తో 'దబాంగ్​ 3'లో కనిపించాడు. తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​లోనూ ఓ కీలకపాత్రలో నటించే ఛాన్స్​ కొట్టేసినట్లు తెలుస్తోంది.

దర్శకధీరుడు ఎస్.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. మల్టీసారర్​గా తెరకెక్కుతోన్నఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీంగా నటిస్తున్నారు. వీరిద్దరి కలయికతో ఈ సినిమాపై ఆసక్తితోపాటు అంచనాలూ భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల హాలీవుడ్​ తారలను పరిచయం చేశాడు జక్కన్న. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త బయటికి వచ్చింది. ఇందులో కన్నడ స్టార్‌ సుదీప్‌ నటిస్తున్నాడట. ఆయన పోషించే పాత్ర గురించి కూడా సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

సుదీప్‌ పోలీసు అధికారిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ', 'బాహుబలి' చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు కిచ్చా.

గతంలో పోలీసుపాత్రలో సుదీప్​

దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో జులై 30న విడుదల కానుంది.

Last Updated : Jan 18, 2020, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details