తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథతో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'తలైవి'. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించారు. ఎ. ఎల్. విజయ్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని 'ఇలా ఇలా' అంటూ సాగే రొమాంటిక్ గీతాన్ని హీరోయిన్ సమంత శుక్రవారం విడుదల చేశారు.
అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఇందులోని 'జిందగీ' పాటను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.