బాలీవుడ్లో నెపొటిజమ్పై చెలరేగిన వివాదం.. ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బంధుప్రీతికి పలువులు సెలబ్రిటీలు మద్దతుగా నిలుస్తున్నారంటూ కంగనా రనౌత్ విరుచుకుపడుతోంది. తాజాగా నెపోటిజమ్‌పై కామెంట్లు చేసిన కరీనా కపూర్ ఖాన్‌పై.. కంగన సోషల్‌మీడియా టీమ్ మాటల తూటాలను పేల్చింది. ఇండస్ట్రీలో కరీన విజయానికి అర్హురాలు కాదంటూ ఆరోపించింది. కొంతమంది స్టార్ వారసులు బాలీవుడ్లో తమ పలుకుబడిని ఉపయోగిస్తున్నారని వరుస ట్వీట్లతో విరుచుకుపడింది.
"అవును కరీనా జీ.. ప్రేక్షకులు మీ అందర్నీ ఫేమస్ చేశారు. కానీ ఈ అనర్హమైన విజయాన్ని సాధించడానికి మీరు పలుకుబడిని ఉపయోగిస్తున్నారని వారికి తెలియదు. అయితే, వీటికి ఒకసారి సమాధానం చెప్పండి. 1)ఎందుకు కంగనను.. మీకు నమ్మకమైన స్నేహితుడు ఇండస్ట్రీని వదిలి వెళ్లాలని అన్నాడు?. 2)సుశాంత్‌ను ఎందుకని భారీ ప్రొడక్షన్ హౌస్ నుంచి బహిష్కరించారు?. 3)సుశాంత్‌ను రేపిస్ట్ అని, కంగనను మంత్రగత్తె అని ఎందుకు పిలిచారు?. 4)కంగనను వివాహం చేసుకుంటానని నమ్మించి.. మీ నెపోటిజానికి చెందిన ఓ యాక్టర్ ఆమెపైనే ఎందుకు క్రిమినల్ కేసు పెట్టాడు?."