బాలీవుడ్ క్వీన్ అంటే గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇటీవలే 'మణికర్ణిక'లో నటనతో పాటు దర్శకత్వం వహించి ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు మరో సినిమాని పట్టాలెక్కించనుంది. పూర్తి యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో ఉండనుందని ఆమె తెలిపింది.
'ప్రస్తుతం తర్వాతి సినిమా పనిలో బిజీగా ఉన్నాను. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందీ చిత్రం. దాని పనులన్నింటినీ ఓ వరుస క్రమంలో చేసుకుంటూ వస్తున్నాం. స్క్రిప్ట్ వర్క్ సిద్ధమైంది. త్వరలో ఫొటోషూట్ చేస్తాం. తర్వాత పోస్టర్ను విడుదల చేస్తాం' -కంగనా రనౌత్, హీరోయిన్