బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, ఆలియా భట్ కుటుంబాల మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆలియా సోదరి నటి పూజా భట్.. తన తండ్రి మహేష్ భట్ వెండితెరకు పరిచయం చేసిన సంగతిని కంగనా గుర్తుచేసుకోవాలని సూచించింది. 2006లో విడుదలైన 'గ్యాంగ్‌స్టర్'తో తమ ద్వారానే కంగనా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినట్లు గుర్తుచేసింది. తమపై మాటలతో విరుచుకుపడటం సరికాదని వెల్లడించింది.
అయితే దీనిపై స్పందించిన కంగన సోషల్‌మీడియా టీమ్ మహేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో మహేష్.. కంగనాను పిచ్చిదాన్ని చేసి మానసికంగా ఎంతో వేధించాడని ఆరోపించింది. దీంతోపాటు ఆమెపై ఒకానొక సందర్భంలో చెప్పులు కూడా విసిరాడని ట్వీట్ చేసింది.
కెరీర్ పతనం చేయాలని