సినీ తారలకు దేశభక్తి ఉండాలని అంటోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. దేశానికి సంబంధించిన ముఖ్య విషయాలపై ఆసక్తిని కలిగి ఉండాలని చెబుతోంది. అలియా, రణ్బీర్ కపూర్, రణ్వీర్ సింగ్ పై విమర్శలు చేసింది.
అలియా భట్, రణ్వీర్ సింగ్ గల్లీ బాయ్ విజయోత్సవ సభలో పుల్వామా దాడి గురించి అడిగిన ప్రశ్నకు.. రాజకీయ విషయాలు మాట్లాడటం ఎందుకని సమాధానం ఇచ్చారు. దీనిపై కంగనా స్పందిస్తూ సెలబ్రీటీస్ కాస్త బాధ్యతగా ఉంటే మంచిదని హితవు పలికింది.