మూవీ మాఫియా కారణంగా ఒకానొక సమయంలో బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారని నటి కంగనరనౌత్ తెలిపారు. గురువారం సుశాంత్ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ కంగన వరుసగా ట్వీట్లు చేశారు. మనం మానసికంగా కుంగుబాటులో ఉన్నప్పుడు ఎవరైనా మాదకద్రవ్యాలు తీసుకోమని సలహా ఇస్తే అలాంటి వారికి దూరంగా ఉండమని ఆమె సూచించారు.
"డియర్ సుశాంత్.. మూవీ మాఫియా నిన్ను బ్యాన్ చేసింది. ఎన్నో అవమానాలు, వేధింపులకు పాల్పడింది. అలాంటి వాటిని ఎదుర్కోవడం కోసం సోషల్‌మీడియా వేదికగా నువ్వు ఎన్నోసార్లు సాయం కోరావు. ఆ సమయంలో నీకు అండగా నిలవలేకపోయినందుకు నాకెంతో బాధగా ఉంది. 'మూవీ మాఫియా నా కెరీర్‌ను నాశనం చేయాలని చూస్తోంది', యశ్‌రాజ్‌ఫిల్మ్స్ నన్ను బ్యాన్ చేసింది, బాలీవుడ్‌లోని కొంతమంది వ్యక్తులు నా కెరీర్‌కు అటంకం కలిస్తున్నారు' అంటూ పలు ఇంటర్వ్యూల్లో సుశాంత్ చెప్పిన మాటలను ఎప్పటికీ మర్చిపోను."