జాతీయ స్థాయులో ఉత్తమ నటిగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంపికైంది. మణికర్ణిక, పంగా సినిమాలకుగాను కంగనకు ఈ పురస్కారం వరించింది.
ఝాన్సీ లక్ష్మీబాయిగా కంగన నటించిన మణికర్ణిక సినిమా 2019లో విడుదలై ఆకట్టుకుంది. విడుదలైన 12 రోజుల్లోనే రూ.84 కోట్ల కలెక్షన్లు సాధించి బాక్సాఫీసు వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.