తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్రైలర్: 'పంగా'లో కబడ్డీ క్రీడాకారిణిగా కంగనా - Panga Kangana

కంగనారనౌత్​ ఈ సారి జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా తెరపై కనపడనుంది. నిజజీవిత పాత్ర ఆధారంగా రూపొందిన 'పంగా'ను జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

kangana ranuat Panga trailer Release Today
పంగా ట్రైలర్

By

Published : Dec 23, 2019, 9:31 PM IST

కంగనారనౌత్​ నటించిన 'పంగా' సినిమా ట్రైలర్​ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో కబడ్డీ క్రీడాకారిణిగా కనపించనుంది కంగనా.

మూడు నిముషాల నిడివి గల ట్రైలర్​లో కంగనా, కబడ్డీ జాతీయ జట్టులో స్థానం కోసం పోరాడే క్రీడాకారిణిగా కనిపించనుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి తన భర్త, కుమారుడి నుంచి ఎలా ప్రోత్సాహం అందిందో అందులో చూపించారు.

ఈ చిత్రానికి నిఖిల్​ మెహ్రోతా కథ అందించగా, అశ్విని అయ్యర్​ తివారీ దర్శకత్వం వహించింది. జనవరి 24 విడుదల కానున్న 'స్పీడ్​ డాన్సర్​'తో ఈ సినిమా పోటీపడనుంది.

ఇదీ చదవండి: రామ్ చేతిలో గన్.. డమ్మీ కాదు ఒరిజినల్‌

ABOUT THE AUTHOR

...view details