బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'తేజస్'. ఈ సినిమాకు సంబంధించి కంగన ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం కానున్నట్లు ట్విట్టర్లో ఫొటో పోస్ట్ చేసింది. ఇందులో యుద్ధ విమానం తేజస్ పక్కన ఆమె నిలబడి.. వైమానిక దళం యూనిఫామ్ ధరించి కనిపించింది.
"డిసెంబరులో 'తేజస్' పైకి ఎగరనుంది. వైమానిక దళాల ధైర్య సాహసాలను చూపిస్తూ తెరకెక్కించే ఈ చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. జై హింద్"