తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పోకిరి'లో కంగనాను ఊహించగలమా! - కంగనా రనౌత్

మహేశ్​బాబు 'పోకిరి'లో తొలుత కంగనా రనౌత్ హీరోయిన్​గా​ నటించాల్సి ఉంది. అయితే అదే సమయంలో బాలీవుడ్​లోనూ అవకాశం వచ్చింది. ఆ ఛాన్స్ ఇలియానాను వరించింది.

కంగనా రనౌత్

By

Published : Jul 25, 2019, 7:54 PM IST

మహేశ్​బాబు హీరోగా వచ్చిన 'పోకిరి'... బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దర్శకత్వం వహించిన పూరీ జగన్నాథ్ పేరు మార్మోగిపోయింది. హీరోయిన్​గా నటించిన గోవా బ్యూటీ ఇలియానా అభిమానుల్ని తన నడుముతో కట్టిపడేసింది. అయితే కథానాయిక పాత్ర కోసం ఆమె తొలి ఎంపిక కాదు. ఆ అవకాశం బాలీవుడ్ నటి కంగనా రనౌత్​ను మొదట వరించింది. కానీ ఆ ఛాన్స్ వద్దనుకుంది.

కారణమిదే

బాలీవుడ్ నటి కంగనా.. ఒకేసారి 'ఫైర్ బ్రాండ్', 'పోకిరి' సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. ఈ రెండింటి షూటింగ్ ఒకే సమయంలో ప్రారంభమవుతుండటం వల్ల బాలీవుడ్​లో మొదటగా నటించేందుకు సిద్ధమైంది. అక్కడే నటిగా స్థిరపడిపోయింది. తర్వాత ఆమె స్థానంలో ఇలియానాను తీసుకున్నాడు పూరీ.

కొన్నాళ్ల తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఏక్ నిరంజన్​'లో ప్రభాస్​ సరసన నటించింది కంగనా. ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇది సంగతి: రణ్​బీర్​కు కంగనా చురకలు

ABOUT THE AUTHOR

...view details