బాలీవుడ్ నటి కంగనా రనౌత్ త్వరలో పెళ్లి చేసుకోనుంది! ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా బుధవారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రాబోయే ఐదేళ్లలో వివాహ బంధంలోకి అడుగుపెట్టడం సహా పిల్లల్ని కనాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇటీవల ఆమెను పద్మశ్రీ వరించింది. దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డును అందుకుంది కంగన.
రాబోయే ఐదేళ్లలో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోబోతున్నారు అంటూ కంగనను అడగ్గా.. 'కచ్చితంగా పెళ్లి చేసుకోవడం సహా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. వచ్చే ఐదేళ్లలో తల్లిని కావాలనుకుంటున్నాను.' అని కంగన చెప్పింది. తనకు కాబోయే వాడి గురించి త్వరలో అందరికీ తెలుస్తుందని తెలిపింది.