తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పరమ శివుడి సేవలో బాలీవుడ్​ క్వీన్​ కంగనా

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కంగనా.. రామేశ్వరంలోని జ్యోతిర్లింగాన్ని సందర్శించింది. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించింది.

kangana ranaut visited rameswaram temple
పరమ శివుడి సేవలో బాలీవుడ్​ క్వీన్​ కంగనా

By

Published : Feb 23, 2020, 8:44 PM IST

Updated : Mar 2, 2020, 8:09 AM IST

బాలీవుడ్​లో ఫైర్​ బ్రాండ్​గా పేరు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్​... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి బయోపిక్​ 'తలైవి'లో ప్రస్తుతం నటిస్తోంది. చిత్రీకరణ ప్రస్తుతం తమిళనాడులోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామేశ్వరంలోని జ్యోతిర్లింగ దర్శనం చేసుకుందీ భామ. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించింది. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్​ కలాం స్మారకాన్ని ఆ తర్వాత సందర్శించింది.

రామేశ్వరం గుడిలో కంగనా

'తలైవి'లోని టైటిల్‌ పాత్రలో కంగనా కనిపించనుంది. ఇందులో కరుణానిధిగా ప్రకాశ్​రాజ్, ఎమ్​జీఆర్​గా అరవింద స్వామి నటిస్తున్నారు. ఏఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా జూన్​ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్​కలాం స్మారకాన్ని సందర్శించిన కంగనారనౌత్​

ఇదీ చూడండి.. తమిళనాట ఎన్నికల్లో పోటీపడనున్న కంగనా, ప్రకాష్​రాజ్!​

Last Updated : Mar 2, 2020, 8:09 AM IST

ABOUT THE AUTHOR

...view details