తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంగన 'మణికర్ణిక' సీక్వెల్​.. సినిమాకు భారీ బడ్జెట్‌ - మణికర్ణిక సీక్వెల్

భారీ బడ్జెట్​తో తీయనున్న మణికర్ణిక సీక్వెల్​లో కంగనా రనౌత్ నటించనుంది. గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Kangana Ranaut to star in 'Manikarnika Returns: The Legend Of Didda'
భారీ బడ్జెట్‌తో 'మణికర్ణిక' సీక్వెల్‌

By

Published : Jan 14, 2021, 5:04 PM IST

బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ మరోసారి వీరనారి అవతారమెత్తనుంది. ఝాన్సీ లక్ష్మీబాయిగా ఆమె నటించిన 'మణికర్ణిక' 2019లో ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'ది లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా' తీయనున్నారు. తొలి భాగానికి మించిన బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'మణికర్ణిక' నిర్మాత కమల్‌జైన్ దీనిని కూడా నిర్మించనున్నారు.

సీక్వెల్ పనులు ఇప్పటికే మొదలయ్యాయట. స్క్రిప్ట్ పనులు‌ పూర్తయ్యాయని సమాచారం. ఈ చిత్రంలో కంగన.. యోధురాలైన కశ్మీర్ రాణిగా కనిపించనుందని తెలుస్తోంది. కాలు పోలియో బారిన పడినప్పటికీ ఆమె గజనీని రెండుసార్లు యుద్ధంలో ఓడిస్తుంది. ఇలా మరోసారి మహిళా యోధురాలిగా మెప్పించేందుకు కంగన సిద్ధమమతోంది. ఆమె టైటిల్​ రోల్​లో నటించిన జయలలిత బయోపిక్‌ 'తలైవి' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం 'తేజస్‌'లో పైలట్​గా నటిస్తోంది.

మణికర్ణిక సీక్వెల్ షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఇదీ చూడండి:అదిరిపోయే పోస్టర్లు.. పండగ శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details