తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్​! - బాలీవుడ్​లో ఇందిరా గాంధీ బయోపిక్

భారతదేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావితం చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ. ఆమె కథతో ప్రస్తుతం బాలీవుడ్​లో ఓ చిత్రం రూపొందనుంది. అందులో ఇందిరా గాంధీ పాత్రలో వివాదాస్పద నటి కంగనారనౌత్​ నటించనున్నారు.

Kangana Ranaut to play Indira Gandhi in political period drama
ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్​!

By

Published : Jan 29, 2021, 10:10 PM IST

బాలీవుడ్‌లో మరో ఆసక్తికర బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ. ఆమె కథతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో టైటిల్‌ రోల్‌ పోషించేది ఎవరో తెలుసా? నిత్యం వివాదాల్లో ఉంటూ 'నేనింతే' అంటూ అందరినీ గడగడలాడించే కంగనా రనౌత్‌. ప్రస్తుతం ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ బయోపిక్‌ తెరపైకి వచ్చింది.

ఇందిరా గాంధీ గెటప్​లో కంగనా రనౌత్​

"అవును, ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం. స్క్రిప్ట్‌ తుది దశలో ఉంది. అయితే, ఇది ఇందిరాగాంధీ బయోపిక్‌ కాదు. ఇదొక పీరియాడిక్‌ ఫిల్మ్‌. కేవలం పొలిటికల్‌ డ్రామా. ఈ చిత్రం ద్వారా భారతీయ రాజకీయ స్వరూపాన్ని నేటి తరానికి చూపించబోతున్నాం."

- కంగనా రనౌత్​, బాలీవుడ్​ నటి

భారత రాజకీయాల్లో ఇందిరా గాంధీ ఒక ప్రాముఖ్యత గల నాయకురాలని చెప్పిన కంగన.. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఎవరెవరు? ఏయే పాత్రలు పోషిస్తారో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే!

ఇదీ చూడండి:టాలీవుడ్​లో ఈ ఏడాది రిలీజ్​ కానున్న చిత్రాలివే!

ABOUT THE AUTHOR

...view details