'బాహుబలి', 'తలైవి' వంటి చిత్రాలకు కథను అందించిన సినీ రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్.. కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న కొత్త చిత్రం 'సీత: ది ఇంకార్నేషన్'(Sita-The Incarnation Movie). అలౌకిక్ దేశాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సీత పాత్ర కోసం బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను(Kangana Sita) ఎంపిక చేసినట్లు చిత్రబృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాలో రావణుడి పాత్రపై రణ్‌వీర్ మనసు పడ్డాడని ఇటీవలే ప్రచారం జరిగింది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది.
'సీత' సినిమాను ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తుండగా మనోజ్ ముంతాషీర్ సాహిత్య, సంభాషణలు సమకూరుస్తున్నారు. పూర్తిస్థాయి వీఎఫ్ఎక్స్ సాంకేతికతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటివరకు ఎవరూ చూడని, ఎవరికీ తెలియని సరికొత్త 'సీత'ను ఈ సినిమా ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నారు.