తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దీపికా పదుకొణెపై కంగనా కామెంట్లు

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తాను నటించిన 'జడ్జ్​మెంటల్​ హై క్యా' చిత్రాన్ని చూడమని తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​. అయితే ఈ సినిమా రిలీజ్​ సమయంలో తమను కొంతమంది ఇబ్బంది పెట్టారని పరోక్షంగా దీపికా పదుకొణెపై ఆరోపణలు చేశారు. దీనివల్ల మార్కెటింగ్​ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు కంగనా.

Kangana Ranaut Takes a Dig at Deepika Padukone with 'Depression Ki Dukan' Tweet on World Mental Health Day
దీపికా పదుకొణెపై కంగనా కామెంట్లు

By

Published : Oct 10, 2020, 10:06 PM IST

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కథానాయిక కంగనా రనౌత్‌ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. తను నటించిన 'జడ్జ్‌మెంట్‌ హై క్యా' చిత్రాన్ని చూడమని ప్రోత్సహించారు. ఇదే సందర్భంగా కథానాయిక దీపికా పదుకొణెను పరోక్షంగా విమర్శించారు. మానసిక సమస్యలు ఉన్న వారికి అండగా ఉండేందుకు దీపిక 'లివ్ లవ్‌ లాఫ్‌' ఫౌండేషన్‌ను స్థాపించారు. ఒకప్పుడు తను తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడ్డట్లు కూడా వెల్లడించారు.

కంగన, రాజ్‌ కుమార్‌ రావు ప్రధానపాత్రల్లో నటించిన సినిమా 'జడ్జ్‌మెంట్‌ హై క్యా'. తొలుత ఈ సినిమాకు 'మెంటల్‌ హై క్యా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్‌ మానసిక వికలాంగుల్ని కించపరిచేలా ఉందని దీపిక సంస్థ అప్పట్లో వ్యాఖ్యానించింది. అలాంటి సున్నితమైన పదాల్ని వాడటం సరికాదని.. వ్యతిరేకించింది. మరోపక్క ఈ చిత్రం మానసిక సమస్యల్ని ఎలా పరిష్కరిస్తుందో తెలుసుకోమంటూ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ.. సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్ ప్రసూన్ జోషికి ఫిర్యాదు చేసింది.

దీంతో దర్శక, నిర్మాతలు టైటిల్‌ను 'జడ్జ్‌మెంట్‌ హై క్యా'గా మార్చారు. ఈ నేపథ్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కంగన పరోక్షంగా దీపికను విమర్శించారు. "మెంటల్‌ హెల్త్‌పై అవగాహన కల్పించేందుకు మేం తీసిన సినిమాను 'డిప్రెషన్‌ దుకాణాన్ని' నడుపుతున్న వ్యక్తులు కోర్టుకు లాగారు. విడుదలకు ముందు సినిమా టైటిల్‌ను మార్చడం వల్ల మార్కెటింగ్‌ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది ఓ మంచి చిత్రం. ఈ రోజు ఆ చిత్రాన్ని చూడండి" అని కంగన ట్వీ‌ట్‌ చేశారు. దీంతో ఈ విషయం మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది.

ABOUT THE AUTHOR

...view details