ప్రముఖ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీ చండేల్‌కు సమన్లు జారీ చేశారు ముంబయి పోలీసులు. ఈ నెల 23, 24 తేదీల్లో బాంద్రా స్టేషన్లో హాజరుకావాలని కోరారు.
కంగనకు సమన్లు.. సోషల్‌మీడియాలో పోస్టులే కారణం! - Kangana Ranaut bandra police
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
కంగనకు సమన్లు.. సోషల్‌మీడియాలో పోస్టులే కారణం!
మత కలహాలను ప్రేరేపించేలా సోషల్ మీడియాలో కంగన కామెంట్లు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు కాగా.. బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వుల మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.