బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ నమోదు చేసిన పరువునష్టం కేసులో భాగంగా శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆమెకు నోటీసులు అందజేశారు.
ఏం జరిగిందంటే?

ఓ ఇంటర్వ్యూలో నటి కంగన మాట్లాడుతూ తన పేరు ప్రస్తావించి.. తన కీర్తికి భంగం కలిగించిందని జావేద్ అక్తర్ గతేడాది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై ఇటీవలే విచారణ జరిపిన న్యాయస్థానం.. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 1 లోపు కంగనను విచారించేందుకు పోలీసులకు అనుమతినిచ్చింది.
ఇదీ చూడండి:వెనక్కి తగ్గిన 'తాండవ్'- ఆ సీన్స్ డిలీట్!