తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇన్​స్టాలో హాట్​ ఫొటోలతో కంగన.. మరో వివాదం - కంగనా రనౌత్ హాట్ ఫొటోస్

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). రెండు హాట్ ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేసిన ఈ నటి దానికి వివాదాస్పద క్యాప్షన్ ఇచ్చింది.

kangana
కంగన పోస్ట్

By

Published : Jun 10, 2021, 8:21 PM IST

తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut). తన మాటలూ, చేతలతో చాలాసార్లు విమర్శలకూ గురైంది. ఈ కారణంగానే ఆమె ఖాతాను సస్పెండ్ చేసింది ట్విట్టర్. అయినా సోషల్ మీడియాలో తన వివాదాలను కొనసాగిస్తూనే ఉందీ నటి. తాజాగా ఇన్​స్టాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్​గా మారాయి.

కంగన పోస్ట్

తన ఇన్​స్టా ఖాతాలో రెండు హాట్ ఫొటోలను షేర్ చేసింది కంగన. ఈ రెండింటికీ రెండు వేర్వేరు క్యాప్షన్​లు ఇచ్చింది. మొదటి దానికి 'హాట్ సంఘీ' అని, రెండో దానికి 'లిబ్రస్: సంఘీ మహిళా?కాదా?,-నేను: నా బీర్ పట్టుకో (బీర్ ఎమోజీ)' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

కంగన పోస్ట్

కరోనా వైరస్​ బారినపడిన తర్వాత కోలుకున్న కంగన ప్రస్తుతం మనాలిలోని తన ఇంట్లో ఉంటోంది. లాక్​డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ నటి షూటింగ్​ల కోసం ఎదురుచూస్తోంది.

ఇవీ చూడండి: Paayal Rajput: బిగ్​బాస్​ 5పై క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details