మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తనపై.. తన సినిమాలపై ద్వేషాన్ని చూపిస్తోందని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించింది. తన కొత్త చిత్రం 'తలైవి' హిందీలో విడుదల చేయడానికి మల్లీఫ్లెక్స్ అసోసియేషన్ నిరాకరిస్తుందని కంగన తెలిపింది. హీరోల సినిమాలను ఒకలా.. హీరోయిన్ల సినిమాలను మరోలా చూస్తున్నారని ఆమె విమర్శించింది.
సెప్టెంబర్ 10న 'తలైవి'ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేయగా.. హిందీ లో సింగిల్ స్క్రీన్స్ మినహా మల్టీఫ్లెక్స్ థియేటర్లలో విడుదలకు అక్కడి యాజమాన్యాలు అంగీకరించలేదు.
ఈ క్రమంలో మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగన.. ఆ అసోసియేషన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పెద్ద హీరోల చిత్రాలను ఒకే రోజు థియేటర్లలో, ఓటీటీలో విడుదల చేసేందుకు అంగీకరించిన అసోసియేషన్.. ఇప్పుడు గ్రూపిజాన్ని ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించింది. థియేటర్ల వ్యాపారం సజావుగా జరగాలన్న పెద్దలే.. సినిమాలను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని తెలుగు మీడియాకు ఇచ్చిన ముఖాముఖీలో అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు మల్టీఫ్లెక్స్ అసోసియేషన్తో 'తలైవి' నిర్మాతల చర్చలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి:thalaivi: 'ఆయన వల్లే 'తలైవి'లో అవకాశం దక్కింది'