"గల్లీబాయ్ ఓ ఆంగ్ల చిత్రానికి కాపీ సినిమా.. దానికి ఆస్కార్ అవార్డు ఎలా ఇస్తారనుకున్నారు" అంటూ విమర్శలు గుప్పించింది నటి కంగనా రనౌత్ సోదరి రంగోలి. రణ్‌వీర్ సింగ్ - ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన 'గల్లీబాయ్'ని భారత్ తరపున ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్ పురస్కారాలకు ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ కేటగిరీలో అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 10 చిత్రాలు ఎంపిక కాగా.. తదుపరి రౌండ్ ఓటింగ్‌లో ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్‌కు ఎంపికవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో తాజాగా 'గల్లీబాయ్'పై ట్విట్టర్ వేదికగా కంగనా సోదరి తీవ్ర విమర్శలు చేసింది.
"హాలీవుడ్ సినిమా '8 మైల్' స్ఫూర్తితో రూపొందించిన చిత్రమే 'గల్లీబాయ్'. ఇది 'ఉరి', 'మణికర్ణిక' చిత్రాల్లా నిజమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం కాదు. ఇదొక కాపీ సినిమా. ఇలాంటి కాపీ చిత్రాలకు హాలీవుడ్ అవార్డు ఎలా ఇస్తుంది అనుకున్నారు" అంటూ ఘాటుగా విమర్శించింది రంగోలి.