వరుసగా వివాదాలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. ప్రస్తుతం ఆనందంలో మునిగితేలుతోంది. తన చిన్న తమ్ముడు అక్షత్ హల్దీ వేడుకలో సరదాగా గడిపింది. నవంబరులో అతడు పెళ్లిపీటలు ఎక్కబోతుండటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కంగనా.. తన తమ్ముడికి పసుపు రాస్తూ ఎంతో సంతోషంగా కనిపించింది. ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటిస్తోంది కంగన.
తమ్ముడి హల్దీ వేడుకలో కంగన సందడి - తమ్ముడి పెళ్లికి సంబంధిన హల్దీ వేడుకలో కంగనా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. తన సోదరుడి హల్దీ వేడుకలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఎంతో సంతోషంగా గడిపింది. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
హల్దీ వేడుకలో కంగనా