మెక్సికో యాత్రలో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. తులుమ్ నగరంలోని కరీబియన్ సముద్రతీరంలో.. అలల మాటున, శరీరాన్ని ఉత్తేజపరిచే సూర్యకిరణాల వెలుగులో.. అందంతో సెగ పుట్టిస్తోంది. గులాబీ, నీలం రంగు బికినీలో బీచ్లో అటువైపు తిరిగి, ఆ ప్రాంత సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. వెంటే ఓ పుస్తకంతో ప్రశాంతమైన వాతావరణంలో సేదతీరుతోందీ భామ.
"శుభోదయం మిత్రులారా. నా జీవితంలో నేను చూసిన అత్యంత ఉల్లాసవంతమైన ప్రదేశం మెక్సికో. అతి సుందరమైన, అనూహ్యమైన ప్రాంతం. మెక్సికోలోని తులుమ్ ద్వీపంలో దిగిన ఫోటో ఇది" అంటూ పోస్ట్ చేసింది కంగన.