తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫోర్బ్స్​ ఇండియాకు కంగనా లీగల్​ నోటీసులు - కంగనా రనౌత్ వివాదం

ఫోర్బ్స్ జాబితాలో తన ఆదాయాన్ని తప్పుగా చూపినందుకు హీరోయిన్ కంగనా రనౌత్.. సదరు సంస్థకు లీగల్​ నోటీసులు పంపింది. ఈ విషయాన్ని ఆమె సోదరి రంగోలీ ట్విట్టర్​లో వెల్లడించింది.

ఫోర్బ్స్​ ఇండియాకు కంగనా లీగల్​ నోటీసులు
హీరోయిన్ కంగనా రనౌత్

By

Published : Dec 30, 2019, 2:51 PM IST

Updated : Dec 30, 2019, 2:59 PM IST

ఫోర్బ్స్ ఇండియా.. ఇటీవలే తొలి 100 స్థానాల్లో ఉన్న ప్రముఖుల జాబితా విడుదల చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ లేపాడు. హీరో సల్మాన్.​. రెండో స్థానానికి పడిపోయాడు. అయితే ఇందులో తన ఆదాయాన్ని తప్పుగా చూపారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్(70వ స్థానం-రూ.17.5 కోట్లు) పేర్కొంది. ఫోర్బ్స్ ఇండియాకు లీగల్ నోటీసులు పంపింది. ఈ విషయాన్ని ఆమె సోదరి రంగోలీ ట్వీట్ చేసింది.

అంతకు ముందు ఫోర్బ్స్ జాబితా ప్రకటించినపుడే, విమర్శలు చేసింది రంగోలీ. ఇది ఓ మోసపూరిత మ్యాగజైన్ అని ట్విట్టర్​లో రాసుకొచ్చింది. వారు ఏ విధానంలో ఈ లిస్ట్​ విడుదల చేశారో చెప్పాలని సవాలు విసిరింది. ఒకవేళ ఫోర్బ్స్ చెప్పిందే నిజమైతే, తాను బహిరంగంగా క్షమాపణ చెబుతానంది. కంగనా.. ఫోర్బ్స్​లో ప్రకటించిన ఆదాయం కంటే ఎక్కువే ట్యాక్స్​ కడుతుందని రంగోలీ చెప్పింది.​

ఇది చదవండి: వాళ్లను చూస్తుంటే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోంది: కంగనా రనౌత్

Last Updated : Dec 30, 2019, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details