బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత ఇటీవలే 'తలైవి' చిత్రీకరణలో పాల్గొంది. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో కలిసి దిగిన ఫోటోలను ట్వీట్ చేసింది. ఓ సన్నివేశానికి సంబంధించి తామిద్దరం చర్చించుకున్నట్లు తెలిపింది.
"గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నిన్న ఉదయం ఓ సన్నివేశం గురించి చర్చించుకున్నప్పుడు దిగిన ఫోటోస్ ఇవి. ప్రపంచంలో అత్యద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కాని నేను మాత్రం సౌకర్యంగా ఉండేది, ఇష్టపడేది మూవీ సెట్లోనే" అని కంగన ట్వీట్ చేసింది.