లాక్‌డౌన్ ప్రభావంతో చాలా సినిమాలు ఓటీటీలో నేరుగా విడుదల చేస్తారంటూ వార్తలొస్తున్నాయి. ఒకటి రెండు చిత్రాలు ఇప్పటికే ఇలా విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే జయలలిత బయోపిక్ 'తలైవి'.. స్మార్ట్తెరపై రానుందని పుకార్లు వచ్చాయి. ఈ విషయమై స్పందించిన హీరోయిన్ కంగనా రనౌత్... కచ్చితంగా థియేటర్లోనే తొలుత విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఓటీటీ ట్రెండ్పైనా తన అభిప్రాయం వెల్లడించింది.
"తలైవి వంటి భారీ బడ్జెట్, అత్యధిక ప్రేక్షకాదరణ పొందగలిగే సినిమాను తొలుత డిజిటల్ వేదికగా విడుదల చేయలేం. ఇదే కోవలోకి మణికర్ణిక కూడా వస్తుంది. అయితే పంగా, జడ్జిమెంటల్ హై క్యా సినిమాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నా.. ఇవి డిజిటల్ ఫ్రెండ్లీ సినిమాలు. అవి అక్కడ కూడా మంచి లాభాలను సంపాదించాయి. కాబట్టి ఓటీటీలో విడుదల అనేది ఆయా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది"