తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మీ తప్పులను ఎత్తిచూపుతూనే ఉంటా: కంగన - కంగనా ఫైర్​

బాలీవుడ్​ను అసభ్యకరంగా చూపిస్తున్నారంటూ పలు న్యూస్​ ఛానళ్లపై బీటౌన్​కు చెందిన పలు నిర్మాణ సంస్థలు హైకోర్టులో దావా వేశాయి. దీనిపై స్పందించిన నటి కంగనా రనౌత్​.. చిత్రసీమ డ్రగ్స్​, బంధుప్రీతి వంటి చెత్తతో నిండిపోయిందని పునరుద్ఘాటించింది. తాను జీవించి ఉన్నంత వరకు ప్రతిఒక్కరి తప్పులను ఎత్తి చూపుతానని స్పష్టం చేసింది.

Kangana
కంగనా రనౌత్

By

Published : Oct 13, 2020, 12:40 PM IST

బాలీవుడ్​ను కించపరిచే విధంగా చిత్రీకరిస్తున్నారంటూ పలు న్యూస్ ఛాన‌ళ్ల‌పై బాలీవుడ్ ప్ర‌ముఖులు, నిర్మాణ సంస్థ‌లు దిల్లీ హైకోర్టులో దావా వేశాయి. దీనిపై న‌టి కంగ‌నా ర‌నౌత్ మ‌రోసారి త‌న‌దైన శైలిలో ఘాటుగా స్పందించింది.

"బాలీవుడ్​లో రాయలేని ఓ చట్టం ఉంది. 'నా రహస్యాలు నువ్వు చెప్పకు, నీవి నేను చెప్పను'.. అంటూ ఒకరిపై మరొకరు విధేయతతో ఆధారపడి ఉంటారు. కొంతమంది ప్రముఖుల కుటుంబాల చేతిలోనే ఈ చిత్రసీమ నడుస్తోంది. ఇదంతా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇంకా ఎప్పటికి మార్పు వస్తుంది? బీటౌన్​.. డ్ర‌గ్స్, బంధుప్రీతి, జీహాదీ వంటి చెత్తతో నిండిపోయింది. దీన్ని శుభ్రం చేయకుండా నిలిపివేశారు. ముఖ్యంగా బడా నటులు.. సుశాంత్​ సింగ్​ లాంటి యువ హీరోలను తొక్కేస్తున్నారు. అలానే మహిళలు, యువతులను వారి గుప్పిట్లో ఉంచుకుంటున్నారు. నా మీద కూడా కేసు పెట్టండి. ఎందుకంటే నేను జీవించి ఉన్నంత వరకు మీ అంద‌రి తప్పులను ఎండగడుతూనే ఉంటా.

-కంగనా, ట్వీట్​.

ప్రస్తుతం కంగనా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​లో నటిస్తోంది.

ఇదీ చూడండి నువ్వేకావాలి @ 20: హీరో తరుణ్​తో లైవ్​ చిట్​చాట్..మీరూ ప్రశ్నలు సంధించండి..​

ABOUT THE AUTHOR

...view details