తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంగన రనౌత్ వరుసగా పదో రాత్రి కూడా

యాక్షన్ సినిమాలో నటిస్తున్న కంగనా రనౌత్.. 14 గంటల పాటు సాగే నాన్​స్టాప్ షూటింగ్​లో పాల్గొంటోంది. ఈ విషయమై ట్విట్టర్​లో ఫొటోను పంచుకుంది.

Kangana Ranaut Pulls In '14 Hours' On '10th Night-shift' For 'Dhaakad'
కంగనా రనౌత్

By

Published : Feb 13, 2021, 7:31 AM IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం స్పై థ్రిల్లర్‌ నేపథ్యంగా 'ధాకడ్'‌లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా సెట్లో నుంచి ఓ స్టిల్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది. ఇది వరుసగా పదో రోజు రాత్రి. నాన్‌ స్టాప్‌ యాక్షన్‌ చిత్రంగా వస్తోన్న సినిమా కోసం వరుసగా పదోరోజూ షిప్టులోనూ 14 గంటల పాటు షూటింగ్‌ జరిగిందని తెలిపింది.

కంగనా ఇందులో ఏజెంట్‌ అగ్ని పాత్రలో నటిస్తోంది. రజ్నీష్‌ ఘాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ రాంపాల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

"నేను బహిరంగ చర్చకు సిద్ధం. నేను పోషించని పాత్ర లేదు. నాలో ఎన్నో కోణాలు ఉన్నాయి. అవి ఆవిష్కరించే ప్రతిభ కూడా ఉంది. నేను అన్నీ పాత్రలు చేయగలను. గాల్ గోడేట్‌లా యాక్షన్‌తో పాటు గ్లామర్‌ పాత్రల్లోనూ సత్తా చాటగలను" అని కంగన ఇటీవల చెప్పింది.

ధాకడ్ సినిమాలో కంగనా రనౌత్

ABOUT THE AUTHOR

...view details