అక్రమ కట్టడం పేరుతో తన ఇంటికి కూల్చారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించింది. మాహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశిస్తూ.. "ఈ రోజు మీరు నా ఇంటిని కూల్చేశారు. రేపు మీ పొగరు అణుగుతుంది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మాఫియా సాయంతో శివసేన పార్టీ.. తన కార్యాలయాన్ని ధ్వంసం చేసిందని ఆరోపించింది. అన్నీ ఒకే రోజులు కాదని.. భవిష్యత్తులో కచ్చితంగా పరిస్థితులు మారతాయని పేర్కొంది.
ఈ క్రమంలోనే 'అయోధ్య'పైనే కాకుండా.. 'కశ్మీరీ పండిట్ల'పై కూడా సినిమా తీస్తానని కంగన స్పష్టం చేసింది.
"నా దేశ ప్రజలను మేల్కొల్పడానికి కచ్చితంగా కశ్మీరీ పండిట్లపై సినిమా తీస్తానని వాగ్దానం చేస్తున్నా. ఇలాంటి సంఘటన జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఉద్దవ్ ఠాక్రే ఇది ఒకరకంగా మంచిదే".