తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భరతనాట్యంలో కంగనా భంగిమలు చూశారా..? - thalaivi kangana ranaut

బాలీవుడ్​ క్వీన్​ కంగనా తర్వాతి చిత్రం కోసం భరతనాట్యంలో శిక్షణ పొందుతోంది. ఇందుకోసం కఠోర సాధన చేస్తోంది. ఈ సమయంలో తీసుకున్న కొన్ని ఫొటోలు సోషల్​ మీడియాలో షేర్​ చేయగా.. వైరల్​గా మారాయి.

భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటున్న కంగనా

By

Published : Oct 6, 2019, 9:11 PM IST

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ సంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం దివంగత తమిళ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​ 'తలైవి'లో ప్రధాన పాత్ర పోషిస్తోందీ అమ్మడు. ఈ చిత్రం కోసం భరతనాట్యంలోనూ తర్ఫీదు పొందుతోంది. శనివారం డ్యాన్స్​ సాధన చేస్తున్న సందర్భంగా తీసుకున్న చిత్రాలను అభిమానులతో పంచుకుంది కంగనా.

"జయలలిత బయోపిక్​ కోసం భరతనాట్యం నేర్చుకుంటున్న కంగనా రనౌత్.కచ్చితత్వం కోసం సాధన చేస్తోంది​" అని ఫొటోలు ట్విట్టర్​ వేదికగా పంచుకుంది టీమ్​ కంగనా రనౌత్​.

ఈ సినిమా కోసం ఇటీవలే లాస్​ ఏంజెల్స్​లోని ప్రముఖప్రోస్తటిక్ మేకప్​ ఆర్టిస్ట్.. జాసన్​ కోలిన్స్​ వద్ద ​ కొలతలు ఇచ్చింది. ఆమె మైనంతో నింపబడిన చిత్రాలను అభిమానులతో పంచుకుంది.

ప్రోస్తటిక్​ మేకప్​లో కంగనా రనౌత్​

'తలైవి' సినిమా కోసం తమిళ పాఠాలు కూడా నేర్చుకుంది కంగనా రనౌత్‌ . ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ తెరకెక్కిస్తున్నాడు. హిందీలో ఈ సినిమాను 'జయ' టైటిల్‌తో విడుదల చేయనుంది చిత్రబృందం. 'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి విష్ణు ఇందూరి, శైలేష్​​ నిర్మాతలు. వచ్చే ఏడాది దీపావళి కానుకగా సినిమా విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details