తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో ప్రముఖ కథానాయకుడు, మాజీ సీఎం ఎంజీఆర్ ముఖ్య పాత్ర పోషించారు! ఈ నేపథ్యంలోనే ఆయన 104వ జయంతి సందర్భంగా 'తలైవి' నుంచి స్పెషల్ వీడియోను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది.
ఎంజీఆర్.. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంతో మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని.. నాయకురాలు(జయలలిత) వెనుక ఉన్న లెజండ్(ఎంజీఆర్) ఆయనేనని వీడియోలో చిత్రబృందం పేర్కొంది.