తెలంగాణ

telangana

By

Published : Sep 9, 2020, 4:44 PM IST

Updated : Sep 9, 2020, 5:19 PM IST

ETV Bharat / sitara

నాటకీయంగా కంగన ముంబయి ప్రయాణం

బాలీవుడ్ హీరోయిన్ కంగన బుధవారం ముంబయిలో అడుగుపెట్టింది. విమానాశ్రయంలో దిగిన తర్వాత కరోనా పరీక్షల్లో నెగిటివ్​ తేలగా.. నేరుగా నివాసానికి చేరింది. ముంబయి వస్తానని దమ్ముంటే ఆపాలని ఇటీవలే శివసేన నేతలకు సవాల్​ విసిరిందీ అందాల​ భామ.

kangana
కంగన

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్, శివసేన పార్టీ నేతల మధ్య చెలరేగిన ముంబయి వివాదం ఆసక్తికరంగా మారింది.​ ఈ క్రమంలోనే బుధవారం కంగన.. ముంబయి విమానాశ్రయంలో అడుగుపెట్టింది. దీంతో శివసేన కార్యకర్తలు ఎయిర్​పోర్టు​ ఎదుట కంగను వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. నల్ల జెండాలు పట్టుకొని నినాదాలు చేశారు.

ప్రణాళిక ప్రకారం.. చంఢీగఢ్​ నుంచి కమర్షియల్​ ఫ్లైట్​లో బయలుదేరిన కంగన.. మధ్యాహ్నం 2.30 గంటలకు ముంబయి చేరుకుంది. అనంతరం కరోనా పరీక్షల్లో నెగెటివ్​ రాగా.. విమానాశ్రయం నుంచి నేరుగా నివాసానికి వెళ్లింది.

మద్దతుగా ఇతర పార్టీ నేతలు

మరోవైపు ఆర్పీఐ(ఏ), కర్ణిసేన పార్టీ కార్యకర్తలు కంగనకు మద్దతుగా నిలబడ్డారు. ఆమె ముంబయిలో ఉన్నంతవరకు తాము నటికి రక్షణగా ఉంటామని ఆర్పీఐ(ఏ) నేత, యూనియన్​ మంత్రి రామ్​దాస్​ అథవాలే అన్నారు.

కంగన చేసే ఈ పోరులో భాజపా అండగా ఉంటుందని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

భవంతి కూల్చివేతపై కోర్టు స్టే

మరోవైపు ముంబయి బాంద్రాలోని కంగన భవంతిని.. అక్రమ కట్టడం పేరిట మున్సిపల్​ అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. ఈ విషయమై హై కోర్టులో ఆమె వ్యాజ్యం దాఖలు చేయగా.. స్టే విధించింది న్యాయస్థానం.

అక్కడ మొదలైన వివాదం

ఇటీవలే సుశాంత్‌ సింగ్‌ మృతి కేసు గురించి మాట్లాడుతూ.. ముంబయి పోలీసులపై తీవ్ర విమర్శలు చేసింది కంగన. దీంతో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, ఆమెను ముంబయిలో అడుగుపెట్టే హక్కు లేదని అన్నారు. వాటికి కంగన స్పందిస్తూ.. ఇది తనను బహిరంగంగా బెదిరించడమేనని.. ముంబయి పాక్‌ ఆక్రమిత కశ్మీర్​లా(పీఓకే) అనిపిస్తోందని పేర్కొంది. ముంబయికి వస్తున్నానని వీలైతే ఆపుకోమని సవాలు విసిరింది.

Last Updated : Sep 9, 2020, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details