'తలైవి' షూటింగ్ కోసం హైదరాబాద్‌కు పయనమైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఇప్పట్లో తాను మనాలికి రాకపోవచ్చని చెప్పింది. వరుస సినిమా చిత్రీకరణలు ఆమెకు ఉండటమే కారణంగా తెలుస్తోంది.
ఇప్పట్లో ఇంటికి వెళ్లడం కష్టమే: కంగనా రనౌత్ - కంగనా రనౌత్ తాజా వార్తలు
'తలైవి' చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కు వస్తున్న కంగన.. ఆసక్తికర పోస్ట్ పెట్టింది. తాను ఇప్పట్లో ఇంటికి వెళ్లకపోవచ్చని తెలిపింది. హిమాలయాలకు బాయ్ చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది.
కంగన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'తలైవి'. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన షెడ్యూల్లో పాల్గొన్న ఈమె.. తన సోదరుడి పెళ్లి కోసం మనాలి వెళ్లింది. అనంతరం తిరిగి భాగ్యనగరానికి వస్తోంది.
"మనకు ఇష్టమైన దానికి బాయ్ చెప్పడం అంత సులభం కాదు. కానీ మా పర్వతాలకు బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చింది. 'తలైవి' చివరి షెడ్యూల్ కోసం హైదరాబాద్‌కు వెళ్తున్నాను. వరుస సినిమా చిత్రీకరణల కారణంగా ఇప్పట్లో మనాలీకి రాకపోవచ్చు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో నాకు ఆశ్రయం కల్పించిన హిమాలయాలకు ధన్యవాదాలు" అని కంగన రాసుకొచ్చింది.