బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నివాసాన్ని అక్రమ కట్టడం అంటూ పాక్షికంగా కూల్చివేసింది ముంబయి మహానగర పాలక సంస్థ (బీఎంసీ). ఈ నేపథ్యంలో తన నివాసంలో రూ.2 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందని నటి కంగన ముంబయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంటీరియర్ కళాకృతులు, సోఫా వంటి విలువైన వస్తువులతో కలిపి 40 శాతానికి పైగా ఆస్తి ధ్వంసం అయినట్లు పేర్కొంది. ఆ మొత్తాన్ని బీఎంసీ చెల్లించాలంటూ కోర్టుకు విన్నవించుకుంది. నోటీసులు జారీ చేసిన 24 గంటల్లోనే కూల్చివేతను ఆమె సవాలు చేసింది.
రూ.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని కంగన పిటిషన్ - కంగనా
ముంబయిలోని పాలీహిల్లో తన నివాసాన్ని కూల్చివేసిన క్రమంలో రూ.2 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని నటి కంగనా రనౌత్ ఆరోపించింది. దీనికి కారణమైన ముంబయి మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నష్టాన్ని భర్తీ చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది కంగన.
కూల్చివేతలో రూ.2 కోట్ల ఆస్తి నష్టం..కోర్టులో కంగన పిటిషన్
ఏం జరిగింది?
ముంబయిలోని పాలీహిల్లో కంగన తన నివాసాన్ని నిబంధనలను అతిక్రమించి కట్టిందనే ఆరోపణలతో బీఎంసీ గతంలో నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత రోజే ఆమె నివాసాన్ని కూల్చేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయంలో వారికి వివరణ ఇవ్వడానికి గతవారం కంగన ముంబయి చేరుకుంది. అయితే ఈ దాడిని మహారాష్ట్ర సర్కారులో కొలువుదీరిన శివసేన చేయించిందని ఆమె ఆరోపించడం వల్ల ఆ పార్టీ నాయకులకు, కంగనకు మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
Last Updated : Sep 15, 2020, 3:13 PM IST