తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ హీరోతో సన్నిహితంగా ఉన్నా సరే చిన్న పాత్రలే: కంగన

ఎంపీ జయా బచ్చన్​ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా రనౌత్.. తన కష్టం వల్లే నటిగా ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. గతంలో ఓ హీరోకు సన్నిహితంగా ఉన్నాసరే చిన్న చిన్న పాత్రలే ఇచ్చేవారని తెలిపారు.

Kangana: Industry offered 2-minute roles, item numbers after sleeping with hero
కంగనా రనౌత్ జయా బచ్చన్

By

Published : Sep 17, 2020, 6:30 PM IST

బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ బీటౌన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఇండస్ట్రీలోని సెలబ్రిటీలపై తీవ్ర విమర్శలు చేస్తూ తరచూ పోస్టులు పెడుతున్నారు. ఈ మధ్యే పలువుర్ని దూషిస్తూ ట్వీట్లు చేసిన కంగన.. పార్లమెంట్‌లో జయాబచ్చన్‌ వ్యాఖ్యలపై విమర్శలు కురిపించారు. తాను ఎంచుకున్న సినిమాల వల్లే తనకు గుర్తింపు వచ్చిందని అన్నారు.

'జయాజీ.. ఇండస్ట్రీకి స్త్రీవాదం నేర్పించింది నేను. ఎందుకంటే పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో.. ఓ హీరోకు సన్నిహితంగా ఉన్నా సరే చిన్న పాత్రల్లో మాత్రమే అవకాశమిచ్చేవారు. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న పాత్రలు, రొమాంటిక్‌ సన్నివేశాలకు మాత్రమే నన్ను చూపించేవారు. హీరోయిన్‌గా ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అది మీ వల్ల కాదు. ఎన్నో మంచి కథా చిత్రాల్లో నటించడం వల్లే ఈస్థాయికి వచ్చాను’ - కంగన రనౌత్, బాలీవుడ్ కథానాయిక

యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ అనుమానస్పద మృతి కేసును పోలీసులు డ్రగ్స్‌ కోణంలో విచారిస్తున్న నేపథ్యంలో ఇటీవల కంగన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీటౌన్‌లోని 99శాతం మంది నటీనటులు, ఇతర సెలబ్రిటీలు డ్రగ్స్‌ తీసుకుంటారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. బాలీవుడ్‌ అగ్రహీరోలు రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, విక్కీ కౌశల్‌, అయాన్‌ ముఖర్జీ రక్తపరీక్షలు చేయించుకుని తాము క్లీన్‌ అని నిరూపించుకోవాలని కంగన సవాలు విసిరారు.

ABOUT THE AUTHOR

...view details