బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం 'తలైవి'(Thalaivi). నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం లాక్‌డౌన్ ముగిసినా థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోకపోవడం వల్ల ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలవుతుందంటూ ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై స్పందించింది కంగన.
"ఇప్పటి వరకు తలైవి చిత్ర విడుదల తేదీ ఖరారు కాలేదు. అవాస్తవాల్ని నమ్మకండి. దేశవ్యాప్తంగా థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం."