తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంగనా రనౌత్​కు అత్యాచార బెదిరింపులు - కంగనా రనౌత్ కేసు

నటి కంగనా రనౌత్​కు, ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది నుంచి అత్యాచార బెదిరింపులు వచ్చాయి. అయితే తన ఫేస్​బుక్ అకౌంట్​ హ్యాక్​ అయిందని, అందుకే ఇలాంటి కామెంట్లు వచ్చాయని ఆయన తెలిపారు.

Kangana Ranaut gets rape threat from Odisha lawyer
కంగనా రనౌత్​కు అత్యాచార బెదిరింపులు

By

Published : Oct 21, 2020, 11:20 AM IST

Updated : Oct 21, 2020, 11:48 AM IST

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం ఈమె తన సోదరుడి పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంది కంగన. ఈ నేపథ్యంలో ఆమె షేర్‌ చేసిన కొన్ని ఫొటోలకు ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది నుంచి అత్యాచార బెదిరింపులతో కూడిన కామెంట్స్‌ వచ్చాయి. 'నడిరోడ్డుపై అత్యాచారం చేస్తా' అంటూ వచ్చిన కామెంట్స్‌ చూసి నెటిజన్లు షాకయ్యారు.

అయితే తన ఫేస్‌బుక్‌ అకౌంట్ హ్యాక్‌ అయిందని న్యాయవాది ఇప్పుడు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు. 'నా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేసి దాని నుంచి అసభ్యకరమైన కామెంట్లు పెట్టారు. నా స్నేహితుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని షాకయ్యాను. నాకు మహిళలు, సమాజం పట్ల గౌరవం ఉంది. నా ఎకౌంట్‌ నుంచి వచ్చిన అసభ్యకర కామెంట్స్‌ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి' అని సదరు న్యాయవాది చెప్పారు. అలా పోస్ట్‌ పెట్టిన కొద్ది సమయానికే ఆయన తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేశారు. ఆ కామెంట్లపై కంగన స్పందించలేదు.

మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కంగనా రనౌత్‌, ఆమె సోదరి రంగోలీ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారని పేర్కొంటూ ఇటీవల ఓ వ్యక్తి ముంబయి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. కంగన, రంగోలీపై కేసు నమోదు చేయాలని పేర్కొంది. దీంతో నటీమణితోపాటు ఆమె సోదరిపై ముంబయి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇది చదవండి:నటి కంగనా రనౌత్​పై మరో కేసు

Last Updated : Oct 21, 2020, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details