తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'తలైవి'. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జయ పాత్రలో నటిస్తోంది. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం కంగనా కొంత బరువు పెరిగినట్లు సమాచారం. ప్రస్తుతం జయ పాత్ర కోసం తమిళం నేర్చుకుంటున్న ఈ భామ.. ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడా విషయంపై స్పందించింది.
"తమిళం నేర్చుకోవడం చాలా శ్రమతో కూడిన విషయం. కష్టంగా ఉంది. అయినా నేర్చుకుంటున్నా. చాలా డైలాగులను బట్టి పడుతున్నా. ఈ సినిమాలో డైలాగ్లు మరింత కీలకం కానున్నాయి. గతంలోనే తమిళం నేర్చుకోవాలని ఆశ పడ్డాను. కానీ కుదరలేదు. ఇప్పుడు గట్టి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఈ సినిమాకు తమిళం చాలా ముఖ్యం" -కంగనా రనౌత్, హీరోయిన్