అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను కొనియాడింది సినీ నటి కంగనా రనౌత్. అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టబోతున్న మొదటి మహిళ కమల కావడంపై ఆనందం వ్యక్తం చేసింది. ఏడాది తర్వాత కమలా హారిసే అమెరికాను పాలిస్తుందని ట్వీట్ చేసింది.
అధ్యక్షుడిగా గెలిచిన జో బైడెన్‌పై మాత్రం వివాదాస్పద కామెంట్లు చేసింది కంగన. డెమొక్రటిక్ అభ్యర్థిని 'గజినీ'తో పోల్చింది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె కామెంట్లను ట్రోల్ చేయడం గమనార్హం.