తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చైనా నుంచి నా ఖాతా హ్యాక్‌ చేశారు: కంగన

చైనా నుంచి తన ఇన్​స్టా గ్రామ్​ ఖాతా హ్యాక్ చేసినట్లు నటి కంగనా రనౌత్ తెలిపింది. తాలిబన్ల గురించి పోస్ట్‌ చేశాక ఇలా జరిగిందని పేర్కొంది.

kangana ranaut
కంగన రనౌత్, నటి

By

Published : Aug 18, 2021, 7:36 PM IST

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లు బుధవారం వెల్లడించింది. చైనా నుంచి తన అకౌంట్​ హ్యాక్​ అయినట్లు పేర్కొంది.

"చైనా నుంచి నా అకౌంట్‌ హ్యాక్‌ చేయడానికి ప్రయత్నించినట్లు ఇన్‌స్టా నుంచి నిన్న రాత్రి అలర్ట్‌ వచ్చింది. ఈరోజు నా అకౌంట్‌ తెరిచి చూస్తే సడన్‌గా కనిపించకుండా పోయింది. తాలిబన్ల గురించి నేను చేసిన పోస్టులన్నీ కనుమరుగయ్యాయి. నా అకౌంట్‌ని హ్యాక్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వారికి ఫిర్యాదు చేసిన అనంతరం మళ్లీ నా అకౌంట్‌ తిరిగి వచ్చింది. కానీ ఏదైనా రాసే క్రమంలో లాగ్‌ఆఫ్‌ అవుతుంది. అందుకే నా సోదరి ఫొన్‌ నుంచి నా అకౌంట్‌ ఓపెన్‌ చేసి ఈ స్టోరీ పెడుతున్నా. ఇదంతా ఓ అంతర్జాతీయ కుట్ర.. నమ్మశక్యంగా లేదు" అని కంగన పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details