తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఊర్మిళను పోర్న్ స్టార్​తో పోల్చిన  కంగన - బాలీవుడ్​ మూవీ మాఫియా

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో హాట్​టాపిక్​గా నిలిచింది. సీనియర్​ నటి ఊర్మిళను 'సాఫ్ట్​ పోర్న్​ స్టార్' అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే ఈ విషయంలో బాలీవుడ్​లోని కొందరు ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా నిలిచారు.

Kangana calls Urmila 'soft porn star', celebs extend support to latter
ఊర్మిళ, కంగన రనౌత్​

By

Published : Sep 17, 2020, 1:50 PM IST

Updated : Sep 17, 2020, 3:12 PM IST

హిందీ చిత్రసీమలో మూవీ మాఫియాపై విమర్శలు చేస్తూ.. ముంబయిని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్​తో పోల్చి వివాదాల్లోకెక్కిన నటి కంగనా రనౌత్​ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి నటి ఊర్మిళను సాఫ్ట్​ పోర్న్​ స్టార్​ అంటూ కంగన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సోషల్​మీడియాలో పలువురు ప్రముఖుల దగ్గర నుంచి కంగనపై పరోక్ష విమర్శలు వచ్చాయి.

టికెట్​ పొందడం కష్టమేమి కాదు

ఇటీవలే ఓ టీవీ ఇంటర్వ్యూలో నటి ఊర్మిళను ఉద్దేశించి కంగన.. 'సాఫ్ట్​ పోర్న్​ స్టార్​' అని పిలిచింది. రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటే తనకు టికెట్​ దొరకడం కష్టమేమి కాదని కంగన అభిప్రాయపడింది. "ఊర్మిళ ఓ సాఫ్ట్​ పోర్న్​స్టార్​. ఇది చాలా కఠినమైన పదమని నాకు తెలుసు. కానీ, ఆమెకు నటన కచ్చితంగా తెలియదు. ఆమె దేని వల్ల వెలుగులోకి వచ్చిందో అందరికి బాగా తెలుసు? సాఫ్ట్​ పోర్న్​ చేయడం వల్లే ఆమె తెలిసింది కదా! ఆమె టికెట్​ పొందగలిగితే నాకు టికెట్​ ఎందుకు రాదు?" అని ప్రశ్నించింది.

డ్రగ్స్​ మూలమే ఆ రాష్ట్రం!

బాలీవుడ్​ను డ్రగ్​ మాఫియా అని కంగన చేసిన ఆరోపణల దగ్గర నుంచి వారిద్దరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. డ్రగ్స్​ విషయంలో ఊర్మిళ స్పందిస్తూ.. "దేశమంతా మాదకద్రవ్యాల సమస్యను ఎదుర్కొంటోంది. డ్రగ్స్​కు మూలం హిమాచల్​ ప్రదేశ్​ అని ఆమెకు తెలుసా? ముందు ఆ రాష్ట్రం నుంచే ఆమె ఈ ప్రచారాన్ని ప్రారంభించాలి" అని కంగనకు వ్యతిరేకంగా మాట్లాడింది ఊర్మిళ.

దీనిపై పలువురు బాలీవుడ్​ ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా నిలిచారు. దర్శకనిర్మాత అనుభవ్​ సిన్హా ఊర్మిళను ప్రశంసించారు. నటి స్వర భాస్కర్​.. ఊర్మిళ నటించిన సినిమాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఊర్మిళకు మద్దతు లభిస్తున్న క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి కంగన ఓ ట్వీట్​ చేసింది.

Last Updated : Sep 17, 2020, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details